Grab the widget  IWeb Gator

నాక్కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది: గోపీచంద్

నిజ జీవితంలో‘మొగుడు’కాబోతున్నారు హీరో గోపీచంద్. ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. ఏ క్షణాన ‘మొగుడు’ టైటిల్ ఎనౌన్స్ చేశారో కానీ… అప్పట్నుంచి అందరికీ నా పెళ్లి గురించే చర్చ. నాక్కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. ఆల్రెడీ ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. త్వరలోనే నా పెళ్లి ఉంటుంది. ఈ లోగా నేను కట్టించుకుంటున్న ఇల్లు కూడా రెడీ అవుతుంది. కృష్ణవంశీకి పెళ్లి విషయాల్లో బాగా ఎక్సపర్ట్ కాబట్టి ఆయనే దగ్గరుండి ఎరేంజ్ మెంట్స్ చేస్తానన్నారు.. అంటూ తన ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పేసారు హీరో గోపీచంద్. ఆయన తాజా చిత్రం ‘మొగుడు’ప్రమోషన్ లో కాలసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ‘‘వరుసగా యాక్షన్ నేపథ్యమే ఎంచుకుంటే ఓ పరిధిలోనే సినిమాలు చేయాల్సివస్తుంది. నటుడు అన్నాక అన్ని రసాలూ చేయాలి. అందుకే ఏరికోరి కృష్ణవంశీ దర్శకత్వంలో ‘మొగుడు’ చేశాను. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గర కావాలన్న నా కల నెరవేరింది’’ అన్నారు.

0 comments:

Post a Comment